Bhimavaram : రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవాలి.. ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, కేఎన్‌ఆర్
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
పట్టణంలోని మెంటేవారి తోటలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా బుధవారం నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరాన్ని భీమవరం శాసనసభ్యులు అంజిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్‌ఆర్) ప్రారంభించారు.
ఈ సందర్భంగా అంజిబాబు, కేఎన్‌ఆర్ లు మాట్లాడుతూ..
అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని, రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని, రక్తదానం చేయడం ద్వారా సమాజానికి విలువైన సేవ చేసినట్లవుతుందని పేర్కొన్నారు. పండుగలను సేవా కార్యక్రమాలతో అనుసంధానం చేయడం అభినందనీయమన్నారు.
బాల గణేష్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
