📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

రాజమహేంద్రవరం : భారీ వర్షాలు, గోదావరి వరదలపై అప్రమత్తత

  • ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు పెట్టొద్దు.. ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలి : జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : స్వచ్ఛవార్త :

ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, అలాగే గోదావరి నదికి ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పోలీసు, విద్యుత్, నీటిపారుదల, రహదారులు, మున్సిపల్ తదితర అత్యవసర సేవల విభాగాల సిబ్బంది ఎటువంటి సెలవులు పెట్టరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇప్పటికే సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది కూడా వెంటనే తమ విధులు నిర్వహిస్తున్న ప్రధాన కార్యాలయాలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు ప్రతి శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది తమ పరిధిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

కంట్రోల్ రూమ్‌లతో నిరంతర సమన్వయం :

వర్షాలు, వరదల పరిస్థితిపై సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి శాఖ అధికారులు తమ సిబ్బంది వివరాలతో పాటు అత్యవసర సమయంలో అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయ సిబ్బంది వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.

గోదావరి నది నీటిమట్టాలు, వాగులు, కాలువలు, లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ, అవసరమైన చోట ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రజల భద్రతకు ప్రాధాన్యత :

భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన సందర్భాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ తెలిపారు. 

వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అత్యవసర వైద్య సేవలకు సిద్ధంగా ఉండాలని, రెవెన్యూ మరియు సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు తదితర అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడినప్పుడు వెంటనే స్పందించేలా సంబంధిత శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.

ప్రస్తుత విపత్కర వాతావరణ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం