📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : భూములు కోల్పోయే వారికి న్యాయం చేస్తాం : బాధితులకు ఎంపీ పుట్టా మహేష్‌ హామీ

ఏలూరు జిల్లా : ఎంపీ కార్యాలయం : స్వచ్ఛవార్త :

అభివృద్ధి పనులకు భూసేకరణలో ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

అమరావతి–ఖరగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే భూసేకరణలో భూములు, ఇళ్లు నష్టపోకుండా చూడాలని జంగారెడ్డిగూడెం మండలంలోని బయ్యనగూడెం, సీతంపేట, వీరన్నగూడెం, సరిపల్లి గ్రామాల ప్రజలు కోరారు. ఈ అంశంపై జాతీయ రహదారుల అధికారులతో, కేంద్ర మంత్రితో మాట్లాడి న్యాయం చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు

నేవీ డిపోపై సీఎంతో చర్చ :

కొయ్యలగూడెం మండలం బోడిగూడెం గ్రామస్థులు నేవీ ఆయుధ డిపో కోసం భూములు కోల్పోతున్న తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేయగా, ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఎంపీ తెలిపారు. రైతులకు, గ్రామస్థులకు న్యాయమైన పరిహారం, హామీల అమలు అనంతరం ప్రజల అంగీకారంతోనే ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.

కూటమి ఐక్యతతో స్థానిక ఎన్నికలపై తీర్మానం :

అనంతరం జిల్లా టీడీపీ కార్యవర్గ సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ పాల్గొన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, పార్టీ నేతలు పాల్గొన్న సమావేశంలో పొత్తులో భాగంగా ఎవరికి అవకాశం వచ్చినా కూటమి పార్టీలన్నీ సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం