📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Gudlavalleru : కొండలమ్మ సన్నిధిలో భక్తులకు అన్నప్రసాద వితరణ


కృష్ణాజిల్లా : గుడ్లవల్లేరు : స్వచ్ఛవార్త :

మండలంలోని వేమవరం గ్రామంలో కొలువైన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. విజయవాడకు చెందిన పుట్టగుంట రంగ, కనకదుర్గ, రాజారావు, నిర్మలాదేవి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. 

శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, క్యూలైన్లు, అన్నప్రసాద వితరణ తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అన్నప్రసాద వితరణకు సహకరించిన దాతలను దేవస్థానం ఈవో ఆకుల కొండలరావు శేషవస్త్రంతో సత్కరించి, అమ్మవారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ ఈడే మోహన్, ధర్మకర్తల మండలి సభ్యులు వడ్లమూడి రవీంద్రబాబు, కళ్లేపల్లి సుగుణశేఖర్ పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం