Proddutur : విద్యుత్ వైర్ల చోరీ నిందితుల ముఠా అరెస్ట్
- ఆరుగురు నిందితులు, 15 ఏళ్ల బాలుడి అరెస్ట్..
- రూ.5.40 లక్షల నగదు, 61 కిలోల వైర్లు, మూడు వాహనాలు స్వాధీనం..
కడప జిల్లా : ప్రొద్దుటూరు క్రైమ్ : స్వచ్ఛవార్త :
ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ వైర్లను దొంగిలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ విభూకృష్ణ తెలిపారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
విద్యుత్ వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో పోలిచెట్టి వెంకటేశ్వర్లు, మద్దికం కృష్ణయ్య, ముక్కమల్ల మహేష్, మాలికి సాయికిరణ్, పోలంకి రంగనాయకులు, మరో వ్యక్తితో పాటు 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు.
నిందితుల నుంచి రూ.5.40 లక్షల నగదు, 61 కిలోల విద్యుత్ వైర్లు, మూడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనాలకు ఉపయోగించినట్లు భావిస్తున్న వాహనాలను కూడా స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో జరిగిన విద్యుత్ వైర్ల దొంగతనాలకు సంబంధించి నిందితుల పాత్రపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సామగ్రి, వాహనాలు, నగదుకు సంబంధించి పూర్తి వివరాలను దర్యాప్తులో పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
మీడియా సమావేశంలో సీఐ నాగభూషణ్, ఎస్‌ఐ రాజు పాల్గొన్నారు. కేసు దర్యాప్తును రూరల్ పోలీసులు కొనసాగిస్తున్నారు.
