📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru Rural Circle : ప్రశాంత వాతావరణంలో వినాయక విగ్రహ నిమజ్జనాలు


  • 4 మండలాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు : కైకలూరు రూరల్ సర్కిల్ సీఐ వి. రవికుమార్ 

ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్ సర్కిల్ : స్వచ్ఛవార్త :

వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు సూచనలు చేస్తున్న సీఐ రవికుమార్ 

కైకలూరు రూరల్ సర్కిల్ పరిధిలోని 4 మండలాల్లో 50 వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శనివారం కైకలూరు రూరల్ సర్కిల్ సిఐ వి.రవికుమార్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిమజ్జన కార్యక్రమాల భద్రత కోసం 20 మంది రిక్రూట్‌మెంట్ పోలీస్ కానిస్టేబుళ్లు (Recruit PCs), 80 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తులో వినియోగించారు. నిమజ్జన ప్రాంతాల్లో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. అదేవిధంగా, నిమజ్జన ప్రదేశాలు, ఊరేగింపు మార్గాలు, పలు  ముఖ్యమైన ప్రాంతాలపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ప్రజలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసులు ఈసందర్భంగా సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బందోబస్తుకు పటిష్ట చర్యలు చేపట్టారు.
షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం