📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : ఎక్సైజ్ రెన్యువల్ దరఖాస్తుల గడువు 23 వరకు పొడిగింపు

 

ఏలూరు జిల్లా : ఏలూరు : స్వచ్ఛవార్త :

ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు రెన్యువల్ దరఖాస్తుల సమర్పణ గడువును మరో రెండు రోజులు పొడిగించినట్లు ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. లైసెన్సుదారులు, ఎస్‌హెచ్‌ఓలు ఈ విషయాన్ని గమనించి నిర్ణీత గడువులోగా దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

ఇప్పటివరకు రెన్యువల్ దరఖాస్తులు సమర్పించలేని లైసెన్సుదారులకు అదనపు అవకాశం కల్పిస్తూ గడువును ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించినట్లు తెలిపారు. సంబంధిత లైసెన్సుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని గడువు ముగిసేలోగా రెన్యువల్ అప్లికేషన్లను సమర్పించాలని సూచించారు.

ఎక్సైజ్ శాఖకు సంబంధించిన రెన్యువల్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు, లైసెన్సుదారులు చర్యలు తీసుకోవాలని ఆవులయ్య కోరారు. ఈ గడువు పొడిగింపు విషయాన్ని ఎస్‌హెచ్‌ఓలు తమ పరిధిలోని లైసెన్సుదారులకు తెలియజేయాలని పేర్కొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం