Kalidindi : మట్టగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల SMC కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :
మండలంలోని మట్టగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా మంగళవారం జరిగింది. చైర్మన్‌గా కోపనాతి రాము, వైస్ చైర్మన్‌గా తెనాలి బేబీ ఎన్నికయ్యారు.
అనంతరం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో SMC కీలక పాత్ర పోషించాలని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, మంచి విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ లక్ష్య సాధనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని కోరారు.
నూతనంగా ఎన్నికైన SMC కమిటీ సభ్యులకు శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేసి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, SMC సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
