Bhimavaram : అశ్వద్ధ గణపతి సన్నిధిలో ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా అన్నదానం
- భక్తులకు అన్నప్రసాదం.. 51 కేజీల లడ్డూ వితరణ
పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
పట్టణంలోని మావుళ్లమ్మవారి ఉపాలయమైన శ్రీ అశ్వద్ధ గణపతి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని అందించి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తాపేశ్వరానికి చెందిన సురుచి స్వీట్స్ వారు స్వామివారికి సమర్పించిన 51 కేజీల లడ్డూను ఎమ్మెల్యే రామాంజనేయులు భక్తులకు వితరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
