Kaikaluru : ఐదేళ్ల పదవీకాలం పూర్తి.. ఎంపీపీ అడవి కృష్ణకు కూటమి నేతల ఘన సత్కారం
ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త :
కైకలూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న అడవి కృష్ణను కైకలూరు నియోజకవర్గ కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. బుధవారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ..
గత ఐదేళ్లుగా కైకలూరు మండల అభివృద్ధికి అడవి కృష్ణ అందించిన సేవలను కొనియాడారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా తన పదవీకాలంలో మండల అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకంగా పనిచేశారని పేర్కొన్నారు.
కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ నాయకత్వంలో అడవి కృష్ణ భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకుడు బీకేఎం నాని, జనసేన నాయకుడు కొల్లి వరప్రసాద్ (బాబి), రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు డైరెక్టర్ నల్లగోపుల చలపతి, మాజీ సర్పంచ్ బోయిన శ్రీనివాస్, యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరేటి శ్రీహరి, బీజేపీ మండల అధ్యక్షుడు జగదీష్, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు గంగుల అశోక్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
