📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : పౌర్ణమి సందర్భంగా శ్రీ మావుళ్లమ్మ సన్నిధిలో చండీహోమం

ప.గో జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :

భీమవరం పట్టణంలోని ప్రముఖ ఆరాధ్యదైవం మావుళ్లమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా శనివారం చండీహోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు, చండీహోమ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో 64 మంది దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు గొంతెన రమణ, పాపోలు ఏడుకొండలు తదితరులు చండీహోమంలో పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

అమ్మవారి అనుగ్రహంతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సమాజానికి శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షిస్తూ చండీహోమం నిర్వహించినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ బుద్ధ మహాలక్ష్మి నగేష్‌ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం