📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : తెలుగు భాషను భావితరాలకు అందించాలి : ప్రిన్సిపాల్ కిషోర్ బాబు


ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త :

తెలుగు భాషను సరళంగా, సహజంగా ఉపయోగించడంతో పాటు దాని గొప్పతనాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జాగృతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపాల్ జయ కిషోర్ బాబు అన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

వ్యావహారిక భాషోద్యమానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు సేవలను ఈ సందర్భంగా జయ కిషోర్ బాబు స్మరించుకున్నారు. తెలుగు భాషను పండితుల పరిధి నుంచి సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో తీసుకురావడంలో గిడుగు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.

విద్యార్థులు చిన్ననాటి నుంచే తెలుగు భాషపై మక్కువ పెంచుకోవాలని, మాట్లాడటం, చదవడం, రాయడం ద్వారా భాషపై పట్టు సాధించాలని సూచించారు. తెలుగు భాషను కాపాడటంతో పాటు దాని ప్రాధాన్యతను తదుపరి తరాలకు తెలియజేయాలని అన్నారు.

ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు వేదకుమారి, దేవి, ఎల్.వి. శ్యామల, సుభాషిణిలను జయ కిషోర్ బాబు చేతుల మీదుగా సన్మానించారు. తెలుగు పండితుడిగా సేవలందిస్తున్న జయ కిషోర్ బాబును ఉపాధ్యాయులు సత్కరించారు.

కార్యక్రమంలో విద్యార్థులు తెలుగు భాష గొప్పతనాన్ని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం