📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Vetapalem : ఓటర్ల జాబితా పరిశీలనలో ధ్రువీకరణ పత్రాలే కీలకం : జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్

బాపట్ల జిల్లా : వేటపాలెం : స్వచ్ఛవార్త :

ఓటర్ల జాబితా పరిశీలనలో ధ్రువీకరణ పత్రాలే కీలకమని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి తెలిపారు. 

వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం స్వర్ణ గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవల తీరును అడిగి తెలుసుకున్నారు. 

ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా నోటీసులు అందుకున్న వారితో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. 194 బిఎల్ఓ నుండి గొల్లప్రోలు ఆదిలక్ష్మి మహిళకు నోటీసులు జారీ అయ్యాయి. ఆమె పేరులో స్వల్ప అక్షర దోషం ఉండడంతో ఆమెకు నోటీసులు జారీపై ఆరా తీశారు. 

ఆమె తన ఓటు హక్కు పొందడానికి నమోదు చేసుకున్న దరఖాస్తును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్నానంటూ ఆమె తన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు పత్రాలను కలెక్టర్ కు చూపారు. ఆమె అందించిన ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించిన కలెక్టర్ తక్షణమే సరి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. 

బి ఎల్ ఓ యాప్ ద్వారా జరుగుతున్న ఓటర్ పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ప్రజల నుంచి నమోదైన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 13 రకాల ధ్రువీకరణ పత్రాలను ఆధారం చేసుకుని విచారణ జరపాలన్నారు. తద్వారా సమస్య పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు. 

ఆయన వెంట చీరాల ఆర్డీవో నరసింహారావు, వేటపాలెం తహసిల్దార్, తదితరులు ఉన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం