📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

కోట్లు పెట్టి కొన్న ఇంట్లో రిపేర్లా..? సొంత డబ్బులు ఖర్చు పెట్టకండి!.. ఈ చట్టం తెలుసుకోండి

కోట్లు వెచ్చించి డ్రీమ్ హోమ్ కొనుగోలు చేశారా..? కొద్ది నెలలకే గోడలపై తేమ, ప్లాస్టరింగ్ ఊడిపోవడం, స్లాబ్‌లలో క్రాక్స్ రావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయా..? అయితే రేరా చట్టం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. సాధారణంగా ఫ్లాట్ హ్యాండోవర్ ఇచ్చిన ఏడాది తిరగకుండానే బిల్డర్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత వచ్చే మేజర్ రిపేర్లకు నివాస సంఘాలు లేదా ఫ్లాట్ యజమానులే తమ సొంత జేబుల నుంచి లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం నగరంలోని అనేక గేటెడ్ కమ్యూనిటీలలో నిత్యకృత్యంగా మారింది. అయితే, ఈ నిర్మాణ లోపాల బాధ్యత బిల్డర్‌దేనని, చట్టప్రకారం ఉచితంగా బాగుచేయించే హక్కు తమకు ఉందనే విషయం మెజారిటీ కొనుగోలుదారులకు తెలియడం లేదు.

వాస్తవానికి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(RERA) చట్టం కొనుగోలుదారులకు అత్యంత బలమైన భద్రతా కవచాన్ని కల్పించింది. "రెరా" చట్టం సెక్షన్ 14(3) ప్రకారం.. ప్లాట్ లేదా ఫ్లాట్ పొజిషన్ అప్పగించిన తేదీ నుంచి 5 ఏళ్ల వరకు ఆ భవనంలో ఎలాంటి స్ట్రక్చరల్ లోపాలు లేదా నాణ్యతా లోపాలు వచ్చినా దానికి పూర్తి బాధ్యత బిల్డర్‌దే. గోడల పగుళ్లు, ప్లాస్టరింగ్ లోపాలు, ప్లంబింగ్ సమస్యలు, స్లాబ్ లీకేజీలు వంటివి గుర్తిస్తే.. కొనుగోలుదారుడు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా బిల్డర్ తమ సొంత ఖర్చులతో ఉచితంగా బాగు చేసి ఇవ్వాలి.

అయితే, మార్కెట్లో చాలామంది బిల్డర్లు హ్యాండోవర్ సమయంలో కేవలం ఒక ఏడాది మాత్రమే గ్యారెంటీ అంటూ కస్టమర్లను మభ్యపెడుతున్నారు. ఏడాది పూర్తికాగానే మా గ్యారెంటీ కాలం ముగిసింది, ఇక అంతా మెయింటెనెన్స్ అసోసియేషన్ చూసుకోవాలి అని చేతులెత్తేస్తున్నారు. 

చట్టపరమైన అవగాహన లేకపోవడంతో ఫ్లాట్ యజమానులు కూడా బిల్డర్లను నిలదీయలేక, ప్లాస్టరింగ్, వాటర్ ప్రూఫింగ్ రిపేర్ల కోసం ఆక్యుపై అయిన తొలి ఐదేళ్లలోనే భారీగా చందాలు వేసుకుని సొమ్ము వృథా చేసుకుంటున్నారు. బిల్డర్ చెల్లించాల్సిన పరిహారాన్ని లేదా బాగుచేసే బాధ్యతను నివాసితులే తమ తలపై వేసుకుంటున్నారు.

కొత్తగా ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు లేదా, ఇటీవల పొజిషన్ తీసుకున్నవారు తమ హక్కులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఫ్లాట్‌లో ఎలాంటి నాణ్యతా లోపాలు కనిపించినా వెంటనే వాటిని ఫోటోలు, వీడియోల రూపంలో రికార్డ్ చేసి, బిల్డర్‌కు ఇమెయిల్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అధికారిక నోటీస్ పంపాలి. 

ఒకవేళ నోటీస్ ఇచ్చిన 30 రోజుల్లోగా బిల్డర్ స్పందించకపోతే లేదా రిపేర్లు చేయడానికి నిరాకరిస్తే.. కొనుగోలుదారులు నేరుగా తెలంగాణ రెరా అథారిటీని ఆశ్రయించి నష్టపరిహారంతో పాటు ఉచిత రిపేర్లకు ఆదేశాలు పొందవచ్చు. చట్టం ఇచ్చిన ఐదేళ్ల గ్యారెంటీ హక్కును సద్వినియోగం చేసుకోవడమే కొనుగోలుదారులకు అసలైన శ్రీరామరక్ష.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం