📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bantumilli : నకిలీ కరెన్సీ తయారీ ముఠా అరెస్ట్


రూ.1.82 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు, ప్రింటర్, పేపర్ కట్టర్ స్వాధీనం...

కృష్ణాజిల్లా : బంటుమిల్లి : స్వచ్ఛవార్త :

కిరాణా దుకాణంలో నకిలీ రూ.500 నోటును చలామణి చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నకిలీ నోట్లు తయారు చేసి చలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1,82,500 విలువైన నకిలీ రూ.500 నోట్లు, కలర్ ప్రింటర్, 197 ఏ4 షీట్లు, పేపర్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెల 26న కిరాణా దుకాణంలో వాటర్ బాటిల్, సిగరెట్ ప్యాకెట్ కొనుగోలు చేసిన వ్యక్తి రూ.500 నోటు ఇచ్చాడు. ఆ నోటుపై అనుమానం వచ్చిన వ్యాపారి పరిశీలించగా అది నకిలీదిగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు చేపట్టారు. మిలేష్ రొయ్యల కంపెనీ సమీపంలో ఐదుగురు అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద తనిఖీలు నిర్వహించగా భారీగా నకిలీ కరెన్సీ నోట్లు, నకిలీ నోట్లు తయారు చేసేందుకు ఉపయోగించిన పరికరాలు లభించాయి.

పోలీసులు షేక్ జానీ, చిట్టి బొమ్మ చినపాము, వీళ్ల రామకృష్ణ, దాసరి రామకృష్ణ, గుడిసె అజయ్ కుమార్‌లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం