📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : మద్యం నియంత్రణ ఇదేనా..? బెల్ట్‌ షాపులకు విచ్చలవిడిగా అనుమతులా? : వాకా ఫైర్

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త : 

మద్యం దశలవారీగా అరికడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు బెల్ట్‌ షాపులకు అనుమతులు ఇచ్చి మద్యం విక్రయాలను మరింత పెంచుతోందని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వాకా రామచంద్రరావు మాట్లాడుతూ.. 

కల్లుగీత వృత్తి రాష్ట్రంలో రోజురోజుకూ కనుమరుగవుతోందని, దీనికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎన్నికల ముందు మద్యం దశలవారీగా నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బెల్ట్‌ షాపులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్‌ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, అనధికారికంగా పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కల్లుగీత కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని వాకా రామచంద్రరావు హెచ్చరించారు. కల్లుగీత వృత్తిని పరిరక్షించడంతో పాటు కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం