T. Narasapuram : విద్యార్థులు క్రీడా ప్రతిభతో పాఠశాలకు, గ్రామానికి గుర్తింపు తీసుకురావాలి
ఏలూరు జిల్లా : టి.నరసాపురం : స్వచ్ఛవార్త :
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న 50 మంది విద్యార్థులకు జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మధ్యాహ్నపువారిగూడెం పిఎసిఎస్ చైర్ పర్సన్ అడపా నాగరాజు సొంత నిధులతో ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్సులను పంపిణీ చేశారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకే ఈ సాయం చేశానని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి పాఠశాలకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా నాగరాజు ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో క్రీడాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉచితంగా క్రీడా దుస్తులను అందించిన అడపా నాగరాజును పాఠశాల యాజమాన్యం, అధికారులు ప్రత్యేకంగా అభినందించి ధన్యవాదములు తెలిపారు.
కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి -1 టి. రామ్మూర్తి, హెచ్‌ఎం బి.లింగస్వామి, పీడీ ఎ. రామకృష్ణతో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.