📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Amaravati : ఎన్ని అబద్దాలు చెప్పినా వైసీపీని ప్రజలు నమ్మరు : మంత్రి కొల్లు రవీంద్ర

  • - జగన్ రెడ్డికి ప్రజా సమస్యల కంటే.. రాజకీయమే ముఖ్యమైపోయింది...
  • - ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడు...
  • - రాష్ట్రంలో రైతాంగానికి అత్యంత ద్రోహం చేసింది జగన్ రెడ్డే...
  • - బీసీలకు టీడీపీ బతుకునిస్తే.. వైసీపీ బుగ్గిపాలు చేసింది...
  • - ఎన్ని అబద్దాలు చెప్పినా వైసీపీని ప్రజలు నమ్మేదే లేదని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్...

అమరావతి : స్వచ్ఛవార్త :

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక సాగునీటి రంగాన్ని, వ్యవసాయాన్ని ప్రథమ ప్రాథాన్యంగా తీసుకుని పాలన సాగిస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వైసీపీ నేతల కల్తీ మద్యం నుండి, గంజాయి గూండాల నుండి, డ్రగ్స్ మాఫియాల నుండి కాపాడుకుంటున్నామన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సంక్షేమం, బీసీ రిజర్వేషన్లు, డ్రగ్స్, మద్యం, పెట్టుబడులు, ఉద్యోగాల అంశాలపై జగన్ చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ప్రజల కోసం ఏ మాత్రమూ కాదని ఆరోపించారు. జగన్ రెడ్డికి ప్రజల పట్ల చిత్తశుద్ధి, ప్రజాస్వామ్యం పట్ల బాద్యత ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు. అంతేగానీ ప్రెస్‌మీట్లు పెట్టి ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు.

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... 

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గినప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. కరువు పరిస్థితులు, వర్షాభావం వంటి అంశాలపై అసెంబ్లీలో క్షుణ్ణంగా చర్చించాం. ఆ సమయంలో జగన్ రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంచినీటి అవసరాలు తీర్చి వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని ప్రోత్సహిస్తున్నాం. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కరువు, వరదలు, తుఫాన్ల కారణంగా రైతులు భారీగా నష్టపోయారు. దాదాపు రూ.20 వేల కోట్ల మేర రైతాంగానికి నష్టం వాటిల్లితే జగన్ రెడ్డి కేవలం రూ.1,600 కోట్లు అందించి చేతులు దులుపుకున్నాడు. గత ప్రభుత్వం రైతులకు ఏం మేలు చేసిందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా జగన్ రెడ్డీ...

రాయలసీమపై ఇప్పుడు కపట ప్రేమ చూపుతున్న జగన్ రెడ్డి, తన పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా అని సవాల్ విసిరారు. గత ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులపై జగన్ రెడ్డి రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ఏకంగా రూ.13,500 కోట్లు ఖర్చు చేసింది. పట్టిసీమ ప్రాజెక్టు దండగ, పంపుల్ని ఇనప సామాన్లకు అమ్ముకోవడం ఉత్తమం అని విమర్శించిన జగన్, ఇప్పుడు అదే ప్రాజెక్టు కృష్ణా డెల్టా ప్రాంతంలో తాగు, సాగునీటి అవసరాలకు అండగా నిలుస్తోందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. 

హంద్రీనీవా ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఖర్చు చేస్తూ కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందిస్తున్నాం. వెలిగొండ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.8 వేల కోట్లు ఖర్చు చేశాం. నిర్వాసితులకు పరిహారం అందించే చర్యలు చేపడుతున్నాం. పురుషోత్తపట్నం ద్వారా అనకాపల్లి వరకు నీటిని తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 36 ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి 2029 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.

జగన్ రెడ్డి హయాంలో రాయలసీమలో 102 ప్రాజెక్టులకు టెండర్లు రద్దు చేశారు. పోలవరం ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దెబ్బతింది. కాపర్ డ్యామ్ నాశనం చేశారు. తెలంగాణకు మేలు చేయడం కోసం పోలవరం ఎత్తును కుదించిన దుర్మార్గపు చరిత్ర జగన్ రెడ్డిది. కనీసం గేట్లకు గ్రీజు కూడా పూయకుండా అన్నమయ్య ప్రాజెక్టును నాశనం చేశారు. 

39 మంది చావులకు కారణమయ్యారు. జగన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా రాయలసీమ రైతాంగం అన్యాయమైపోయింది. ఎంతటి కరువొచ్చినా రాష్ట్రంలో సాగునీటికి ఇబ్బందులు లేకుండా సాగునీటి ప్రాజెక్టులన్నింటిపైనా పూర్తి చేసేలా కృషి చేస్తున్నాం. జగన్ రెడ్డి ధన దాహానికి బలైపోయిన సాగునీటి రంగం మొత్తాన్ని క్రమంగా మెరుగుపరుస్తున్నాం.

రైతులకు ప్రస్తుత ప్రభుత్వ సాయం ...

రైతాంగానికి అండగా నిలిచే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. 2019-24 మధ్య పంటల బీమాకు ఇవ్వాల్సిన రూ.1900 కోట్లు జగన్ రెడ్డి ఇవ్వకుండా రైతుల్ని దగా చేస్తే.. కూటమి ప్రభుత్వం రాగానే మొత్తం చెల్లించాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున అందిస్తున్నాం. మామిడి, మిర్చి, పొగాకు, ఆక్వా రైతులు ఇబ్బందులు పరిష్కరించాం. మద్దతు ధరలు అందిస్తున్నాం. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆక్వా రంగంపై జగన్ రెడ్డి ఎంతగా కక్షగట్టాడో, జే ట్యాక్స్ పేరుతో ఎంతగా దోచుకున్నారో రైతులందరికీ గుర్తుంది. తప్పుడు ప్రచారంతో ప్రజల్ని దగా చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు నాశనం చేసింది జగన్ రెడ్డే...

బీసీల సంక్షేమం గురించి జగన్‌కు మాట్లాడే నైతిక అర్హత లేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. అసెంబ్లీలో 34 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు జగన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. గతంలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గడం వల్ల 16,800 మంది తమ హక్కులను కోల్పోయారని పేర్కొన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేసి దగా చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. తన సొంత కేసుల కోసం కోట్ల ఫీజులతో లాయర్లను ఉపయోగించే జగన్ రెడ్డి.. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎందుకు ఆ శ్రద్ధ చూపలేదని ప్రశ్నించారు. 

కూటమి ప్రభుత్వం రాజ్యసభకు పంపిన ఆరుగురిలో ముగ్గురు బీసీ వర్గాలకు చెందిన వారని, గత ప్రభుత్వంపై బీసీ సబ్‌ప్లాన్ నిధులు, ఆదరణ పథకం రద్దు తదితర అంశాల్లో చేసిన మోసాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జగన్ రెడ్డి పాలనలో సుమారు 300 మంది బీసీ నేతలు హత్యకు గురయ్యారు. వేలాది మందిపై దాడులకు పాల్పడ్డారు. వేలాది మందికి చెందిన బీసీల భూముల్ని ఆక్రమించుకున్నారు. 

హత్యలు చేసినోళ్లను, కేసుల్ని తప్పుదోవ పట్టించిన వాళ్లను, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వాళ్లను వెనకేసుకురావడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి. తప్పు చేసినోళ్లను వదిలేయాలి అనేలా జగన్ రెడ్డి మాట్లాడడం దుర్మార్గం. సీదిరి అప్పలరాజు బీసీ బిడ్డ అంటున్న జగన్ రెడ్డి.. చనిపోయిన దానయ్య కూడా బీసీ బిడ్డే అని తెలుసుకోవాలి. 18 సంవత్సరాల కుర్రాడు బైకుతో గుద్ది చంపేస్తే కేసు పెట్టకూడదా? కేసును తప్పుదోవ పట్టిస్తే కేసు పెట్టకూడదా? మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేయడం తప్పా? దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణానికి పాలపడిన కేసులో కారుమూరిని ఈడీ అరెస్టు చేస్తే.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం దుర్మార్గం. వైసీపీ నేతల పాపాలు పండాయి. తప్పు చేసినోడు చట్టం నుండి తప్పించుకోవచ్చు. కాలం నుండి తప్పించుకోవడం అసాధ్యమని గుర్తుంచుకోవాలి.

వైసీపీ నేతల గంజాయి మత్తు వదిలిస్తాం...

రాష్ట్రంలో జగన్ రెడ్డి ఊరూరా విస్తరించిన కల్తీ మద్యం మాఫియా నుండి రాష్ట్రాన్ని కాపాడాం. గంజాయి గూండాల నుండి కాపాడుకున్నాం. డ్రగ్స్ డాన్స్ ను కూడా తరిమేశాం. జగన్ రెడ్డి పాలనలో డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యంతో యువత జీవితాలను నాశనం చేశారు. ఉద్యోగాల్లేకుండా మత్తులో ముంచి జీవితాలు ఛిద్రం చేశారు. వైసీపీ నేత అనంతబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో గంజాయి మాఫియాను విస్తరింపజేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముంద్రాపోర్టుకు వేల కోట్ల విలువైన డ్రగ్స్ దిగుమతి చేశారు. రాష్ట్రం మొత్తం కల్తీ మద్యాన్ని అమ్మారు. 

జగన్ రెడ్డి నీతులు మాట్లాడినంత మాత్రాన చేసిన దుర్మార్గాలు చెరిగిపోవు. మొత్తం బండారం బయట పెడతాం. అద్దంకి ఘటన గురించి అధికారులు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా జగన్ రెడ్డి బురద జల్లాలనుకోవడం దుర్మార్గం. అధికారులకు స్వేచ్ఛనిస్తాం. కానీ తప్పు చేస్తే మాత్రం ఉపేక్షించబోమని ఇప్పటికే వారిపై చర్యలు తీసుకుని నిరూపించాం. కేసులో రెండు లైన్లు చదివి ఏదో జరిగిపోయిందని మాట్లాడడం సరికాదని హెచ్చరించారు.

యువతకు ఉద్యోగాలు ఉపాధి లక్ష్యంగా పెట్టుబడులు...

యువతకు యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. రెండేళ్లలో దాదాపు రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చాం. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి తీసుకురావడం పాలనాదక్షతకు నిదర్శనం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో దాదాపు 95 శాతం అమలు చేశామని, మిగిలిన హామీలను కూడా ఆర్థిక వెసులుబాటు మేరకు అమలు చేస్తాం. మెగా డీఎస్సీ నిర్వహించి 16,300 మందికి ఉద్యోగాలు కల్పించాం. 

విద్యుత్ చార్జీల అంశంలో కూడా ప్రజలకు ఉపశమనం కల్పించాం. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని జగన్‌ రెడ్డికి సవాల్ చేశారు. ప్రెస్‌మీట్ల ద్వారా ఆరోపణలు చేయడం కాదు.. చట్టసభలకు వచ్చి నేరుగా చర్చించాలన్నారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారిగా ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పని చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం