📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : శ్రీ మావుళ్లమ్మవారి ఆలయంలో రేపు(శుక్రవారం)విశేష చండీ హోమం


పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త  :

శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని భీమవరం పట్టణంలోని మావుళ్లమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు విశేష చండీ హోమం నిర్వహించనున్నట్లు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

లోకక్షేమం, సర్వజన సౌభాగ్యం, ప్రజల సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ఈ వైదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అమ్మవారి సన్నిధిలో వేదమంత్రోచ్ఛారణలు, చండీ పారాయణం, నవావరణ పూజలు, హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయ ఉత్సవ మండపంలో అష్టాదశ భుజ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ తెలిపారు. చండీ హోమంలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

సమాజంలో శాంతి, కుటుంబాల్లో సౌఖ్యం, ప్రజలకు ఆరోగ్యం, రైతులకు సమృద్ధి, వ్యాపారులకు అభివృద్ధి, సర్వజనులకు సుఖసంతోషాలు కలగాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొనాలని దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు విజ్ఞప్తి చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం