Kalidindi : నవ దంపతులకు టిడిపి నాయకులు జక్కుల విజయ్ ఆశీస్సులు
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం పేదలంక గ్రామానికి చెందిన చి. దాసరి జాన్ హైడ్, అదే గ్రామానికి చెందిన హనీ వివాహ వేడుకలు బుధవారం పెదలంకలో ఘనంగా జరిగాయి.
జాన్ హైడ్ ఆహ్వానం మేరకు టీడీపీ నాయకులు, రాష్ట్ర దళిత నాయకులు జక్కుల విజయ్ కుమార్, వాసురాజు, దళిత నాయకులు భూపతి దానియేలు, చాబత్తిన రాజు, టీడీపీ నాయకులు మానికొండ రాజారావు, జక్కుల మల్లేష్ తదితరులు వివాహ వేడుకలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
