కైకలూరు : సామూహిక వరలక్ష్మి వ్రతాలతో శివనాగేంద్రస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ
కైకలూరు కరగట్టు శివారున ఉన్న శ్రీ శివనాగేంద్రస్వామి ఆలయం వద్ద శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. స్వామివారి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన అమ్మవారి రూపం వద్ద ముత్తయిదువులంతా అమ్మవారికి పూజలు నిర్వహించారు.
తొలుత దానగూడెం రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి కాలనీవాసులు, భక్తులు అమ్మవారికి మంగళవాయిద్యాలతో కలిసి శ్రావణమాస సారె తీసుకువచ్చారు. స్వామివారికి, అమ్మవారికి శ్రావణమాస సారె అందించారు. అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు.
సుమారు 120 మంది ముత్తయిదువులు సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొని పూజలు చేశారు. ముత్తయిదువులకు దాతల సహకారంతో పూజాసామాగ్రి, జాకెట్లు, గాజులు, పసుపుకుంకుమ తాంబూలంతోపాటు లక్ష్మీదేవి అమ్మవారి వెండి కాయిన్, రాగి రూపు అందించారు. భక్తులకు దాతలు ఉచిత ప్రసాదం అందించారు. కార్యక్రమంలో దాతలు, భక్తులు, ముత్తయిదువులు పాల్గొన్నారు.


