Jangareddygudem : సూర్యతేజలో అధునాతన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో
పట్టణంలో గత ఐదేళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న సూర్యతేజ హాస్పిటల్‌ను ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అన్ని విభాగాల్లో ఆధునిక సదుపాయాలతో విస్తరించారు. నూతన సదుపాయాలతో కూడిన మల్టీ స్పెషాలిటీ విభాగాన్ని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ఇప్పటికే ఐదేళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న సూర్యతేజ హాస్పిటల్‌ను మరింత విస్తరించడం ద్వారా పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు, స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ స్థానికంగానే వైద్య సేవలు పొందే అవకాశం ఉండటంతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
ఆసుపత్రి ఫౌండర్లు, చైర్మన్లు కాసాని రామకృష్ణ, నూజల్ల హేమంత్ కుమార్, డైరెక్టర్లు పోలినాటి రవికిషోర్ (రాజా), డాక్టర్ పసుపులేటి దిలీప్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సదుపాయాలను విస్తరిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకుల బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



