Kalidindi : మట్టగుంటలో ఘనంగా ప్రధాని మోదీ 76వ జన్మదిన వేడుకలు.. ముఖ్యఅతిథిగా అండ్రాజు శ్రీను
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :
మండలంలోని మట్టగుంట గ్రామంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అండ్రాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారం రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందన్నారు.
పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలు ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో వాతాడి రాంబాబు, పెద సింగు చంద్రరాజు, కోపనాతి శంకర్, తిరుమలశెట్టి ఈశ్వర పరుశురాముడు, తిరుమణి బ్రహ్మం, నడకుదుటి నాగరాజు, రాజనాల పరుశరామయ్య, పొన్నాల వరదరాజు, నడకుదుటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
