Mudinepalli : అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అంబుల వైష్ణవి ఆర్థిక సాయం
ఏలూరు జిల్లా : ముదినేపల్లి : స్వచ్ఛవార్త :
స్థానిక మసీదు ప్రాంతానికి చెందిన మడ్డి నర్సమ్మ (60) నివాసం ఈరోజు ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. రేకుల షెడ్డుతో నిర్మించిన ఆమె గృహం పూర్తిగా దగ్ధమవడంతో పాటు ఇంట్లో ఉన్న ఫర్నిచర్, గృహోపకరణాలు, బీరువాలో భద్రపరిచిన నగదు కూడా మంటల్లో కాలిపోయాయి.
ఈ ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ బాధితురాలిని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెబుతూ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావాలని స్థానిక దాతలను కోరారు. గ్రామస్థులు కూడా బాధితురాలికి అండగా నిలిచి సహాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

