Mandavalli : దత్తాశ్రమంలో మజ్జిగ పంపిణీ చేసిన రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు "పోసిన"
ఏలూరు జిల్లా: మండవల్లి : స్వచ్ఛవార్త :
మండలంలోని లోకుమూడి దత్తాశ్రమం నందు నిర్వహిస్తున్న మజ్జిగ వితరణ కార్యక్రమంలో నూతన రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పోసిన చెంచు రామారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన వంతుగా గురువారం మజ్జిగ పంపిణీకి దాతగా నిలిచారు.
ముందుగా ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం అధ్యక్షులు రామారావు మాట్లాడుతూ.. గత నెల రోజులుగా వేసవిలో ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు దత్తాశ్రమ నందు దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో సంఘ నేతలు పరసా ఏడుకొండలు, మాడేం కృష్ణారావు, అల్లూరి సత్యనారాయణ, మారగాని బద్రి , కందుల నితిన్ సామ్రాట్, పోలగాని మహాలక్ష్మణుడు,సొంటి చిన్న, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
