పేద విద్యార్దినికి వాసవీ ఇంటర్నేషనల్ రూ.10 వేలు ఆర్ధిక సాయం
దాత బచ్చు రామ్మోహన్ కు కృతజ్ఞతలు తెలిపిన సభ్యులు...
ప.గో జిల్లా : జంగారెడ్డిగూడెం : స్వచ్ఛవార్త :
పేద విద్యార్థులను గుర్తించి వారి విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించేందుకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ముందుకు రావడం అభినందనీయమని సంస్థ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కాటేపల్లి శ్రీనివాస్, 213ఏ జిల్లా జాయింట్ సెక్రటరీ కొల్లేపర ఆనంద్ పేర్కొన్నారు.
మంగళవారం జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో పదో తరగతి చదువుతున్న ప్రతిభావంతురాలు లిఖితకు విద్యా అవసరాల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వాసవి క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షుడు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, వాసవి క్లబ్ వనిత గోల్డ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షురాలు భూమా విజయల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాటేపల్లి శ్రీనివాస్, కొల్లేపర ఆనంద్ మాట్లాడుతూ..
పేద విద్యార్థిని చదువుకు సహకరించిన వనపర్తి జ్యువెలర్స్ అధినేత బచ్చు రామ్మోహనరావు సేవాభావాన్ని అభినందించారు. దాతల సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని వాసవి క్లబ్ గోశాల చైర్మన్ ఏలూరి ఫణికుమార్ తెలిపారు.
కార్యక్రమంలో గ్రీటింగ్ కమిటీ చైర్మన్ సొలస శ్రీనివాస్, సీనియర్ సభ్యులు చిన్ని తుకారాం భాస్కర్ గుప్తా, వాసవి క్లబ్ వనిత గోల్డ్ కార్యదర్శి కాటేపల్లి పద్మజ, కోశాధికారి ధూబకుంట్ల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
