అమరావతి ఛాంపియన్‌షిప్–2026 క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, శాప్ డైరెక్టర్ జగదీశ్వరి
పోలవరం జిల్లా : జీలుగుమిల్లి : స్వచ్ఛవార్త :
అమరావతి ఛాంపియన్‌షిప్–2026లో భాగంగా జీలుగుమిల్లి మండలం బర్రింకాలపాడు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరితో కలిసి రిబ్బన్ కట్ చేసి మంగళవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ..
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడాస్ఫూర్తి క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో అమరావతి ఛాంపియన్‌షిప్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ పి. రామకృష్ణ, విరాట్, పీడీ రమేష్, ఎంఈఓలు శ్రీనివాస్, బుచ్చయ్య, కోఆర్డినేటర్లు, కూటమి నాయకులు టీడీపీ సినియర్ నాయకులు ఉప్పటి వెంకట రావు బండారు అనిల్, కొప్పుల శ్రీకాంత్, రూపా సత్యనారాయణ, శేఖమూడి సాయి, రాయి సుబ్బారావు, తొమ్మిదేళ్ల దుర్గాప్రసాద్, శొంఠి రామకృష్ణ, చిర్రి నాగరాజు, మద్దాల రమేష్, మందపాటి సూర్య, చప్పిడి హరికృష్ణ, మోహన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
