Amaravati : గవర్నర్ కోటా MLC గా లేదా కైకలూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గా అవకాశం కల్పించండి : కొత్త విజ్ఞప్తి
అమరావతి/కైకలూరు : స్వచ్ఛవార్త :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రి కార్యాలయం లో కలిసి గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యునిగా,లేదా కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా అవకాశం కల్పించమని...
తెలుగు విద్యార్థి నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరకు పార్టీకి అంకితభావంతో పనిచేశానని, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా కాపు సామాజిక వర్గ నేతగా పనిచేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందానని, ప్రస్తుత ఏలూరు జిల్లా పూర్వపు కృష్ణాజిల్లాలో ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా, పూర్తి కాలం పార్టీ కోసం అంకితం అంకితభావంతో పనిచేస్తూ ఎదిగిన కాపు నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నానన్నారు. తెలుగుదేశం పార్టీ గత 35 సంవత్సరాలుగా అప్పగించిన ఏ బాధ్యత నైనా సమర్థవంతంగా నిర్వహించి, పార్టీలో మంచి పేరు తెప్పించుకున్నాను అన్నారు.
నా రాజకీయ ప్రస్థానం ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగు యువత కార్యాలయ కార్యదర్శిగా, ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శిగా, 2014- 2019 మధ్యలో కృష్ణా జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ఉండి నియోజకవర్గం రాష్ట్ర పార్టీ పరిశీలకునిగా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి నా వంతు సేవలు అందించాను.
2009 నుండి 2014 వరకు పత్రిక ఎన్నికల్లో, మున్సిపల్ మరియు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో జిల్లా పార్టీ ఎలక్షన్ మానిటరింగ్ సేల్ సభ్యునిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించానని,క నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శిగా కైకలూరు నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శిగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పెడన నియోజవర్గం పరిశీలకునీగా, నూజివీడు, ఆకివీడు మున్సిపల్, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో శ్రీకాళహస్తి పరిశీలకునిగా సమర్థవంతంగా నాకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించానని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉన్న, లేని సమయంలో నైనా నిబద్ధతతో, విధేయతతో సేవలు అందించానని, పార్టీ పరిశీలకుని గా పనిచేసే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 45 నియోజకవర్గాల్లో నాయకులతో, కార్యకర్తలతో విజయ వంతంగా సమన్వయంగా పనిచేసుకునే అనుభవం, కూటమి పార్టీల పొత్తు కాలంలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని శిరసాహించి, గౌరవించే పార్టీ విధేయుడిగా నాకు అవకాశం కల్పించమని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ... నా అభ్యర్థనను తప్పక పరిశీలిస్తానని హామీ ఇవ్వటం జరిగింది.
