📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhogapuram : భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి చీపురుపల్లి నుంచి కూటమి శ్రేణుల భారీ ర్యాలీ

చీపురుపల్లి/భీమవరం : స్వచ్ఛవార్త :

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చీపురుపల్లి నియోజకవర్గం నుంచి శనివారం ఉదయాన్నే కూటమి శ్రేణులు భారీ ఎత్తున బయలుదేరాయి. బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్‌సైకిళ్లతో నిర్వహించిన ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది.

ప్రత్యేక పరిశీలకుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు(KNR), కూటమి నాయకులతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేస్తూ భోగాపురం వైపు పయనమయ్యారు.

ఈ సందర్భంగా కెఎన్ఆర్ మాట్లాడుతూ.. 

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామిక, పర్యాటక రంగాలకు మరింత ఊతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం