📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

ప్రధాని పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం

 బాధ్యతతో విధులు నిర్వహించాలని ఐజీ కే. శ్రీకాంత్ సూచన...


విజయనగరం జిల్లా : భోగాపురం : స్వచ్ఛవార్త :

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో బందోబస్తు విధులు నిర్వహించనున్న పోలీసు అధికారులతో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఐజీ కే. శ్రీకాంత్ సమావేశమయ్యారు. మంగళవారం విమానాశ్రయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ సమావేశంలో భద్రత, బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

ప్రధాని భద్రత, బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణను సెక్టార్లుగా విభజించి వాటి పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. వారికి సహకరించేందుకు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లను నియమిస్తున్నట్లు చెప్పారు. ప్రతి అధికారి తమకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో, అంకితభావంతో నిర్వహించాలని సూచించారు.

విధులు నిర్వహించే ప్రాంతాలను ముందుగానే సందర్శించి, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. ప్రధాని సభకు వచ్చే ప్రజలు సమావేశ ప్రాంగణానికి సకాలంలో చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, బస్సులు మార్గమధ్యంలో నిలిచిపోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విమానాశ్రయానికి వచ్చే మార్గాల్లో ఉన్న ప్రెజర్ పాయింట్ల వద్ద ప్రత్యేక దృష్టి సారించి సమర్థవంతంగా ట్రాఫిక్ నిర్వహించాలని పేర్కొన్నారు.

విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ.. 

సభకు హాజరయ్యే ప్రజలు సురక్షితంగా తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చూడాలని సూచించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాల్లో ర్యాంపులు, రాకపోకల సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయో లేదో అధికారులు పరిశీలించాలని తెలిపారు.

జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ.. 

ప్రధాని పర్యటన సందర్భంగా జిల్లా పోలీసుశాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను వివరించారు. బందోబస్తు విజయవంతం అయ్యేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

సమావేశంలో గ్రేహౌండ్స్ డీఐజీ అట్టాడ బాపూజీ, గ్రేహౌండ్స్ ఎస్పీ సుమిత్ గరుడ్, శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వరరెడ్డి, తుహిర్ సిన్హా, కర్నూలు ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్, చింతలవలస ఏపీఎస్పీ రవిశంకర్, సీఐడీ ఎస్పీ శ్రీధర్, 16వ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ అనిల్ పులిపాటి, మెరైన్ ఎస్పీ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం