పోలవరం నూతన డీఎస్పీగా కె. జయకృష్ణ
పోలవరం జిల్లా : పోలవరం : స్వచ్ఛ వార్త :
పోలవరం సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా కె. జయకృష్ణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో అధికారుల నుంచి బాధ్యతలు చేపట్టి సబ్ డివిజన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు, పెండింగ్ కేసులు, పోలీసింగ్ వ్యవహారాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ కె. జయకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండేలా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, నేరాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి సమాచారాన్ని అందించాలని కోరారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన డీఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు.
