📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

డ్వాక్రా సంఘాలకు రెండు కోట్ల రూపాయల ఉపకరణాలు అందజేత



జీలుగుమిల్లి, జూలై 25 :

జీలుగుమిల్లు ఎమ్మార్వో కార్యాలయం ముందు డీఆర్డిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆజీవిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు యూనిట్లను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించి, నిరుద్యోగ యువతతో పాటు మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆజీవిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన ద్వారా లబ్ధిదారులు ఆర్థికంగా స్వావలంబన సాధించి, తమ కుటుంబాల అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ పేద కుటుంబాల జీవనోపాధి మెరుగుపర్చేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఏజీ ఈ వై యూనిట్లను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి టీవీ విజయలక్ష్మి, ఐటీడీఏ పీవో రాముల నాయక్, ఎంపీడీవో వెంకటలక్ష్మి, డిఆర్డిఏ అడిషనల్ పిడి అనిత, డిపిఎంలు, ఏపీఎంలు జీలుగుమిల్లి ఏపిఎం జిఎల్వి నరసింహారావు, జిల్లా సమైక్య అధ్యక్షులు, ఏడు మండలాల సమాఖ్య అధ్యక్షులు, జీలుగుమిల్లి టిడిపి అధ్యక్షులు సుంకవల్లి సాయి, జనసేన మండల నాయకులు బండారు అనిల్, రూప సత్యనారాయణ, శాఖమూడి సాయి,రాయి సుబ్బారావు,గారపాటి శ్రీను, సిరిబత్తుల స్వామి, గణేష్, మందపాటి సూర్య, తొమ్మిదేళ్ల దుర్గాప్రసాద్, భీమారెడ్డి, గద్దె సుబ్రమణ్యం, పద్దం వెంకటకృష్ణ, దేవుడు శ్రీను, కొప్పుల శ్రీకాంత్, జట్ల సత్యనారాయణ, చింతలపూడి నవీన్,బరగడ తరుణ్, ఊకే సాయి కిరణ్, ఉండవల్లి అరుణ్ కుమార్, తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం