📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

డీఎస్సీ అక్రమ నియామకాల వ్యవహారంలో మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి : పేర్ని నాని డిమాండ్

 


కృష్ణాజిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛ వార్త :

డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, అలాగే నీట్ (NEET) పరీక్షల వ్యవహారంలో తలెత్తిన అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) డిమాండ్ చేశారు. ఈ అంశాలపై బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. లోకేష్ రాజీనామా చేసి మంత్రి పదవి కోసం ఆశతో ఉన్న బోండా ఉమాకు అవకాశం కల్పించాలని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

అదేవిధంగా నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పల హారిక, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జులు, పార్టీ నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం