📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

నందిగామలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటింటి ప్రచారం

ఇంటింటికీ కూటమి పాలన.. అభివృద్ధి–సంక్షేమంపై విస్తృత ప్రచారం 

ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : స్వచ్ఛవార్త :

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నందిగామలో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పెద్ద మసీదు సెంటర్, కుమ్మరి బజార్ ప్రాంతాల్లో కూటమి నాయకులతో కలిసి 'అభివృద్ధి–సంక్షేమానికి రెండేళ్ల నమ్మకం.. కూటమి ప్రభుత్వం' కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. 


ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు మళ్లీ ఊతమిచ్చి, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనతో పాటు సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని, నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తంగిరాల సౌమ్య తెలిపారు. 

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం