Jangareddygudem : తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మద్ది ఆంజనేయస్వామికి అభిషేకాలు
జంగారెడ్డిగూడెం, జూలై 25 :
తొలి ఏకాదశి మహా పర్వదినం సందర్భముగా శనివారం మండలము లోని గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానము నందు ఉదయం 8 గంటల నుండి ఆలయ ముఖ మండపం నందు పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆద్వర్యములో నిర్వహించా రు.ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మద్యాహ్నం వరకు స్వామి వారి ఆలయమునకు వివిధ సేవల రూపేణా రూ.3,42,668/- లు ఆదాయం వచ్చినట్లు, అలాగే మద్యాహ్నం వరకు విచ్చేసిన సుమారు 3407 మంది భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నదానము జరుపబడినది. శ్రీ స్వామి వారి దర్శనమునకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మ కర్తల మండలి అద్యక్షులు రాజాన సత్యనారాయణ మరియు ఆలయ అసిస్టెంట్ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన పత్రికా ప్రకటన లో తెలిపారు.

