గ్రామాల వారీగా ఇన్‌చార్జీల నియామకం.. పార్టీ శ్రేణులతో కోళ్ళ నాగేశ్వరరావు(KNR) సమావేశాలు
విజయనగరం జిల్లా : చీపురుపల్లి : స్వచ్ఛవార్త :
చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించినట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు(KNR) తెలిపారు.
బుధవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుతో కలిసి గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ కార్యక్రమాల అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్‌సైకిళ్ల ర్యాలీల నిర్వహణకు సంబంధించి కార్యాచరణ రూపొందించి, గ్రామాల వారీగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇన్‌చార్జీలను నియమించారు.
అలాగే ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసే డోర్ టు డోర్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
పార్టీ బలోపేతంతో పాటు ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు (KNR) తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.



