📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్ల పరిశీలనలో పలువురు తెదేపా నేతలు

ప్రధాని మోదీ పర్యటన విజయవంతానికి పకడ్బందీ ఏర్పాట్లు...


విజయనగరం జిల్లా : భోగాపురం : స్వచ్ఛవార్త :

భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో సభా వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు.


రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజుతో కలిసి పోలవరం నియోజకవర్గ పరిశీలకుడు కోళ్ల నాగేశ్వరరావు ఏర్పాట్లను సమీక్షించారు.

ప్రధాని పర్యటనకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలపై వారు అధికారులతో చర్చించారు. కార్యక్రమం విజయవంతం అయ్యేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో టీడీపీ నాయకుడు చల్లా వెంకట సత్య వరప్రసాదరావు (కంప్యూటర్ ప్రసాద్)తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం