విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల పాత్ర కీలకం : కోళ్ల నాగేశ్వరరావు
ప.గో జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యతో పాటు విలువలను అందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. 'మెగా పేరెంట్స్ డే' సందర్భంగా స్థానిక ఏఎస్ఆర్ నగర్‌లోని ఝాన్సీ లక్ష్మీభాయ్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కోళ్ల మాట్లాడుతూ...
తల్లిదండ్రులు పిల్లల విద్యాభివృద్ధిపై నిరంతరం దృష్టి సారించాలని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యార్థి, విద్యార్థినుల భవిషత్తు కోసం తల్లికి వందనం, మధ్యాహ్న భోజన పధకం, స్కూల్స్ ఆధునీకరణ, టీచర్ల నియామకం తదితర పధకాలను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం 10 వ తరగతి లో స్కూల్ 1 st, 2 nd, 3 rd వచ్చిన విద్యార్థినులకు నగదు ప్రోత్సాకాలను అందించారు.
కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యారాలు, స్కూల్ పేరెంట్స్ చైర్మన్, మునిసిపల్ డిప్యూటీ కమిషనర్ గారు, సోమేశ్వర రావు, గోపాల శర్మ, ఇందుకూరి రామలింగ రాజు, సత్యనారాయణ రాజు, అనిల్, గురుమూర్తి, బాబురావు, రావూరి కృష్ణ, టీచర్స్, పేరెంట్స్, విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
