📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

మచిలీపట్నం–బంటుమిల్లి రోడ్డు అభివృద్ధికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన మంత్రి కొల్లు రవీంద్ర



మచిలీపట్నం/ఢిల్లీ : స్వచ్ఛవార్త : 

రాష్ట్ర భూగర్భ ఘనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మచిలీపట్నం–బంటుమిల్లి మధ్య 20 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు రాష్ట్ర పర్యాటక, పారిశ్రామిక రంగాల పురోగతికి ఈ రహదారి కీలకంగా మారుతుందని వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. మచిలీపట్నం పోర్టు, మంగినపూడి బీచ్‌కు మెరుగైన రోడ్డు అనుసంధానం కల్పించడం ద్వారా పర్యాటక రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడటంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి కూడా ఊతమిస్తుందని తెలిపారు.

అలాగే మచిలీపట్నం పోర్టును కేంద్రంగా చేసుకుని అభివృద్ధి చెందనున్న ఇండస్ట్రియల్ కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లకు ఈ రహదారి ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కొల్లు రవీంద్ర కోరారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం