మండలంలో నరేగా నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కామినేని
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛ వార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ సోమవారం కలిదిండి మండలంలోని కొండంగి, మట్టగుంట, పెద్దలంక గ్రామాల్లో నరేగా నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను కూటమినేతలతో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఆయా గ్రామాల్లో ఎన్డీఏ నాయకులతో సమావేశమై ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


