కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ప్రజలకు వివరిస్తున్న టీడీపీ నాయకులు "కోళ్ళ"(KNR)
ప.గో జిల్లా : భీమవరం : రాయలం : స్వచ్ఛవార్త :
ఎన్డీఏ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం మంగళవారం భీమవరం నియోజకవర్గంలోని రాయలం గ్రామంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు(KNR )పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవల గురించి వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు, వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకోవడం కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని KNR పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు వినాయక్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కోళ్ల సీతారాం, శ్రీనివాసరాజు, మల్లయ్య, మల్లుల శ్రీధర్, చినిమిల్లి రవి, కోళ్ల పాణి, గోడపాటి బాబూరావు, ప్రసాద్, బూత్ యూనిట్ ఇన్‌చార్జీలు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

