📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Jeelugumilli : నిరుద్యోగ యువతకు వరంగా మెగా జాబ్ మేళా

ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు...

పోలవరం జిల్లా : జీలుగుమిల్లి : స్వచ్ఛవార్త : 

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సారథ్యంలో జీలుగుమిల్లి జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వివిధ ప్రముఖ సంస్థలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ.. 

రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారిస్తోందని, మెగా జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. యువత తమ విద్యార్హతలకు అనుగుణంగా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు,కూటమి నాయకులు సుంకవల్లి సాయి,గుడ్ల రాంబాబు,బండారు అనిల్, పిన్నమనేని మధు,రూపా సత్యనారాయణ, శేఖముడి సాయి,పద్దం వెంకటకృష్ణ,మేచినేని సంజయ్, బోరగం వెంకటలక్ష్మి,తోట బాలు,కోలా ధర్మరాజు, సూరిశెట్టి మహేష్,మోహన్,తొమ్మిదేళ్ల దుర్గా ప్రసాద్, కొత్తూరీ రాజేష్, సిరిబత్తుల స్వామి, మందపాటి సూర్య,దేవుడు శ్రీను, మద్దాల రమేష్,గారపాటి శ్రీను, కక్కిరాల మురళి, కక్కిరాల ఉపేంద్ర,గద్దే సుబ్రహ్మణ్యం ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, ఉద్యోగార్థులు మరియు పలువురు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం