📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : మచిలీపట్నం జిల్లా సైంటిఫిక్ డ్రగ్స్ స్టోర్‌లో అగ్నిప్రమాదం... తృటిలో తప్పిన భారీ ప్రమాదం

కృష్ణాజిల్లా: మచిలీపట్నం : స్వచ్ఛవార్త :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య, వైద్య & గృహ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు చెందిన మచిలీపట్నం జిల్లా సైంటిఫిక్ డ్రగ్స్ స్టోర్‌లో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

స్టోర్‌లోని రూమ్ నంబర్-1లో నిల్వ ఉంచిన బయో మెడికల్ వ్యర్థాల నుంచి మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అక్కడే అందుబాటులో ఉన్న ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. 

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లే  అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయాల్సిన భారీ మొత్తంలో మందుల నిల్వలు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై విచారణ కొనసాగుతోందని జిల్లా సైంటిఫిక్ డ్రగ్స్ స్టోర్ ఇన్‌చార్జి చిన్నారావు తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం