Mudinepalli : అల్లూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నాగరాజు
ఏలూరు జిల్లా : ముదినేపల్లి : స్వచ్ఛవార్త :
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామంలో శనివారం ఉదయాన్నే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దావు నాగరాజు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాసాని బాల యేసు, కులమట్ల రాము, బొమ్మనబోయిన వెంకటరత్నం, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
