📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

T.Narasapuram : దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ

 


ఏలూరు జిల్లా : టి. నరసాపురం : స్వచ్ఛవార్త :

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని భవిత కేంద్రం నందు బుధవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు వీల్‌చైర్లు, మూడుచక్రాల సైకిళ్లు, హియరింగ్ ఎయిడ్స్, టి.ఎల్.ఎం. కిట్లు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖాధికారి–2 ఎస్. కళ్యాణి దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్. కళ్యాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందించిన ఉపకరణాలు విద్యార్థుల దైనందిన జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని, వాటిని సద్వినియోగం చేసుకుని విద్యలో మరింత పురోగతి సాధించాలని సూచించారు. అలాగే మేనరికాల వివాహాలు, బాల్య వివాహాలు, వారసత్వ జన్యుపరమైన లోపాల వల్ల కూడా వికలాంగత్వం సంభవించే అవకాశాలు ఉన్నందున ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అ న్నారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు కె. రాజు మరియు జె. పృథ్విరాజ్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు భవిత కేంద్రంలో అందిస్తున్న ప్రత్యేక విద్య, శిక్షణ, థెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని వినియోగించుకుని విద్యా, వ్యక్తిగత అభివృద్ధి సాధించాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు.

కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయరాలు సిక్కి ప్రత్యేక ఉపాధ్యాయులు, ఉపాధ్యాయనీ లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సమగ్ర శిక్ష సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం