📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Amaravati : ఆర్టీఐ కార్యకర్తలకు సమాచారహక్కు పరిరక్షణ సమైక్య వేదిక విజ్ఞప్తి.. హైకోర్టు పిల్‌కు ఆధారాలు పంపాలని పిలుపు

 


అమరావతి : స్వచ్ఛవార్త :

ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ సమాచార హక్కు చట్టానికి విరుద్ధంగా తీర్పులు ఇస్తోందని ఆరోపిస్తూ, ఈ అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసేందుకు సమాచారహక్కు పరిరక్షణ సమైక్య వేదిక ముందుకు వచ్చింది. ఇందుకు అవసరమైన ఆధారాలను అందించాలని రాష్ట్రంలోని ఆర్టీఐ కార్యకర్తలకు వేదిక విజ్ఞప్తి చేసింది.

సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 18(1) కింద ప్రజా సమాచార అధికారులు గడువులోగా సమాచారం ఇవ్వని సందర్భాల్లో దాఖలైన ఫిర్యాదులపై, జరిమానా లేదా శాఖాపరమైన చర్యలు కోరినప్పటికీ కమిషన్ సమాచారం ఇవ్వాలని మాత్రమే ఆదేశించిన తీర్పుల కాపీలు, సంబంధిత ఫిర్యాదు ప్రతులను పీడీఎఫ్ రూపంలో పంపించాలని కోరింది. 

అలాగే సెక్షన్ 18(1) కింద దాఖలైన ఫిర్యాదులు, రెండో అప్పీళ్లపై విచారణ పూర్తై 90 రోజులు దాటినా తీర్పు ప్రతులు అందని కేసులకు సంబంధించిన నోటీసులు, అప్పీల్ పత్రాలు, ఫిర్యాదు పత్రాలను కూడా పంపించాలని సూచించింది.

ఈ ఆధారాలను సేకరించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు సమాచారహక్కు పరిరక్షణ సమైక్య వేదిక తెలిపింది. రాష్ట్రంలోని ఆర్టీఐ కార్యకర్తలు తమ వద్ద ఉన్న సంబంధిత పత్రాలను 7306319111, 7093657365 నంబర్లకు పీడీఎఫ్ రూపంలో పంపించి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం