Bhimavaram : భీమవరం మావుళ్లమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళం
పశ్చిమ గోదావరి : భీమవరం : స్వచ్ఛవార్త :
భీమవరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మావుళ్లమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి నంద్యాలకు చెందిన యాసం వెంకటేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు రూ. 1,00,116/- నిధుల విరాళాన్ని అందజేశారు. తమ తల్లిదండ్రులు కీర్తిశేషులు యాసం వీరారెడ్డి, పెద్ద వీరమ్మల జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని శుక్రవారం ఆలయ అధికారులకు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దాతల పేరున అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ దాత కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు.
అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ (AC) బుద్ధ మహాలక్ష్మి, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు దాతలను వేదమంత్రాల నడుమ శాలువాతో సత్కరించి, అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు జ్ఞాపికను అందజేసి అభినందించారు.
