📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : ఆక్వా రైతులకు రూ.1.50లకే విద్యుత్ సబ్సిడీ అభినందనీయం : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి "కేఎన్ఆర్"

 

ప.గో జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :

గత ప్రభుత్వ పాలనలోని చీకటి రోజులు పోయి, రాష్ట్రంలో మళ్లీ మంచి రోజులు వచ్చాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు (కేఎన్ఆర్) తెలిపారు. గురువారం స్థానిక ప్రకాశం చౌక్ లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గానికి చెందిన తోట సీతారామలక్ష్మి, మంతెన రామరాజు, కెఎన్ఆర్ లతో పాటు పార్టీ శ్రేణులందరూ కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రి నారా లోకేష్‌లకు భీమవరం నియోజకవర్గ టీడీపీ మరియు కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 

ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్‌ను రూ. 1.50లకే అందిస్తూ జీవో అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఈ సబ్సిడీ కార్యక్రమాన్ని ఈ నెల 11 నుంచి అమల్లోకి తెస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించడం హర్షణీయమన్నారు.

ఈ సందర్భంగా కెఎన్ఆర్ మాట్లాడుతూ...

ఆక్వా రంగంలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దుతూ వస్తోందని పేర్కొన్నారు. గతంలో నిలిచిపోయిన సాగునీటి సంఘాల ఎన్నికలు, పంట కాలవలు, మురుగు కాలవలు, వ్యవసాయ గిట్టుబాటు ధర, మేత మరియు హ్యాచరీల సమస్యలను ప్రభుత్వం వరుసగా పరిష్కరిస్తోందని చెప్పారు.

పాదయాత్రతో ప్రజాస్వామ్య రక్షణ :

గత వైఎస్సార్‌సీపీ రాక్షస పాలనను ఎండగడుతూ లోకేష్ కుప్పం నుంచి సుమారు 3,000 కిలోమీటర్ల మేర సాగించిన ‘యువగళం’ పాదయాత్ర ఒక చారిత్రాత్మక ఘట్టమని నాగేశ్వరరావు కొనియాడారు. భీమవరం ప్రకాష్ చౌక్‌ వద్ద పాదయాత్రపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు దాడి చేసి, నిరపరాధులపై అక్రమ కేసులు బనాయించినప్పటికీ ప్రజాస్వామ్య రక్షణ కోసం వెరవకుండా పోరాడామని గుర్తుచేశారు.

రాబోయే రోజుల్లో లోకేష్ నాయకత్వంలో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నూటికి నూరు శాతం స్థానాలు గెలుచుకునేలా కష్టపడి పనిచేస్తామని కేఎన్ఆర్ స్పష్టం చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం