Bhimavaram : 38వ వార్డులో టీడీపీ డోర్ టూ డోర్ ప్రచారంలో "కేఎన్ఆర్"
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
స్థానిక 38వ వార్డులో తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'డోర్ టూ డోర్' (ఇంటింటికీ ప్రచారం) కార్యక్రమం శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు నేతృత్వం వహించి, వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కోళ్ల నాగేశ్వరరావు వార్డు ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, పార్టీ శ్రేణులు ముందుకు సాగారు. ప్రతి ఇంటా ప్రజలు టీడీపీ నాయకులకు ఘనస్వాగతం పలికారు.
కార్యక్రమంలో ముఖ్య నాయకులు వై. మావుళ్లు, భూపతిరాజు బుజ్జి రాజు, మరపట్ల శ్యాం, బేగం, భూషణం, రావూరి కృష్ణ అప్పారావు, గూడపాటి బాబురావు, వినయ్ కుమార్‌లతో పాటు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

