Bhimavaram : జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవ వందనం సమర్పించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ...
- జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ...
పశ్చిమగోదావరి జిల్లా : జిల్లా పోలీసు కార్యాలయం : భీమవరం : స్వచ్ఛవార్త :
80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆగస్టు 15, శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీస్ సంప్రదాయ జాతీయగీతాల ఆలాపన నడుమ జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ సిబ్బంది, అధికారులు మరియు జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవం ప్రాముఖ్యతను గురించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ......
స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్ర్యం కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదని, ఇది మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో, పోలీసులు తమ విధులను మరింత అంకితభావంతో, క్రమశిక్షణతో నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు.
విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ సేవా పతకం, సేవా పతకం మరియు ప్రశంసా పత్రాలు సాధించిన జిల్లా పోలీసు అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్అపీ ద్నాన్ నయీం అస్మి ప్రత్యేకంగా అభినందించినారు. నిజాయితీగా, అంకితభావంతో ప్రజలకు సేవ చేసే పోలీసు అధికారులు మరియు సిబ్బందికి తప్పక గుర్తింపు లభిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జెండా వందన కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి మరియు డిపిఓ సిబ్బందికి జిల్లా ఎస్పీ మిఠాయిలు అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ, మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) ఇ. ఇందుమతి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



